Nikhil: '18 పేజెస్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

18 pages song released

  • విభిన్నమైన ప్రేమకథగా '18 పేజెస్'
  • నిఖిల్ తో రెండోసారి జోడికట్టిన అనుపమ 
  • సుకుమార్ అందించిన కథ ఇది
  • డిసెంబర్ 23వ తేదీన థియేటర్లకు వస్తున్న సినిమా 

నిఖిల్ హీరోగా '18 పేజెస్' రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 వారితో కలిసి సుకుమార్ నిర్మించిన సినిమా ఇది. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్, 'కుమారి 21' తరువాత దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ విభిన్నమైన ప్రేమకథా చిత్రంలో నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. 
 
సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'ఏ కన్నుకి ఏ స్వప్నమో .. ఏ రెప్పలైనా తెలిపేనా, ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైనా చూపేనా' అంటూ ఈ పాట సాగుతోంది. 

శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను పృథ్వీ చంద్ర - సితార ఆలపించారు. ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. యూత్ కి కనెక్ట్ అయ్యేలానే ఈ పాట నడక ఉంది. 'కార్తికేయ 2' తరువాత నిఖిల్ - అనుపమ కాంబినేషన్లో డిసెంబర్ 23వ తేదీన వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

More Telugu News