Vakkantham Vamsi: పూరికి కథ చెప్పాలంటే మాటలా?: వక్కంతం వంశీ

Vakkkantham Vamsi Intarview

  • 'ఆలీతో సరదాగా' వేదికపై వక్కంతం 
  • పూరిని పరిచయం చేసింది ఎన్టీఆర్ అంటూ వివరణ 
  • 'టెంపర్' కథను పూరికి చెప్పడానికి కంగారుపడ్డానని వెల్లడి 
  • పూరి మెచ్చుకోవడం అదృష్టమంటూ ఆనందం

వక్కంతం వంశీ కథలను అందించిన సినిమాలలో 'టెంపర్' ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను గురించి, 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వక్కంతం వంశీ ప్రస్తావించాడు. "ఎన్టీఆర్ నాకు సూరి ( సురేందర్ రెడ్డి)ని పరిచయం చేశాడు. పూరిని పరిచయం చేశాడు. అప్పటికి ఎన్టీఆర్ కి 'టెంపర్' ఐడియాను చెప్పి ఉన్నాను. ఆ లైన్ ఆయనకి బాగా నచ్చింది. తాను చేస్తే ఎలా ఉంటుందని అడిగితే .. బాగుంటుందని అన్నాడు. 

పూరి డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక సినిమా చేయవలసి ఉంది. అందువలన ఆ కథను పూరికి వినిపించమని ఎన్టీఆర్ నాతో అన్నాడు. పూరి పెద్ద రైటర్ .. తన కథలను మాత్రమే ఆయన చేస్తూ వెళుతుంటాడు. అందువలన నాకు టెన్షన్ పట్టుకుంది. ఎన్టీఆర్ కూడా పూరికి కాల్ చేసి మొహమాటపడుతూనే అడిగాడు. 'కథ బాగుంటే ఎవరిదైతేనేం ... చేస్తాను' అని పూరి అన్నాడు. 

'టెంపర్' లో పూరి స్టయిల్ కి దగ్గరలోనే ఎన్టీఆర్ పాత్ర ఉంటుంది. అందువలన ఆయనకి కనెక్ట్ కావొచ్చనే ధైర్యంతోనే వెళ్లాను. కథ వినగానే పూరి కనెక్ట్ అయ్యారు. చాలా సింపుల్ గా ఆ ప్రాజెక్టు ఓకే అయింది. క్లయిమాక్స్ విషయంలో ఏదో వెలితిగా అనిపించింది. అదేంటో తెలియడం లేదు. అప్పటికప్పుడు ఆలోచన చేసి, ఒక సీన్ చెప్పాను. అంతే.. పూరి ఒక్కసారిగా నన్ను హగ్ చేసుకున్నాడు. అంతకుమించి నాకు ఏం కావాలి? అంటూ చెప్పుకొచ్చాడు.

Vakkantham Vamsi
Ntr
Puri Jagannadh
  • Loading...

More Telugu News