Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన మహిళ... వీడియో ఇదిగో!

Women slapped French President Macron

  • టైన్ మెర్మిటేజ్ టౌన్ లో ఓ కార్యక్రమానికి హాజరైన మాక్రాన్
  • అక్కడున్న కొంత మందితో మాట్లాడేందుకు వెళ్లినప్పుడు ఘటన
  • ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ ఆయన చెంపను ఛెళ్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన నడుస్తూ వెళ్తుండగా ఆలివ్ గ్రీన్ టీషర్ట్ ధరించిన మహిళ చెంపపై కొట్టింది. ఆ సమయంలో కొందరు మీడియా వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మాక్రాన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను పక్కకు లాగేశారు. 

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం... ఫ్రాన్స్ లోని డ్రోమ్ రీజియన్ లోని టైన్ హెర్మిటేజ్ టౌన్ లో ఫుడ్, రెస్టారెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ కార్యక్రమానికి అధ్యక్షుడు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలను మరింత సరళతరం చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంత మంది వద్దకు మాక్రాన్ వెళ్లారు. ఇంతలో ఊహించని విధంగా మాక్రాన్ చెంపను అక్కడున్న ఒక మహిళ ఛెళ్లుమనిపించింది. అక్కడున్న ఓ వ్యక్తితో మాట్లాడేందుకు మాక్రాన్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా మాక్రాన్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

Emmanuel Macron
France
President
Slap

More Telugu News