Dhana Bank: ఏలూరు ధనా బ్యాంక్ చైర్మన్‌ సహా 21 మందికి పదేళ్ల జైలు శిక్ష

Eluru Dhana bank  chairman sentenced to 10 year jail

  • డిపాజిటర్ల సొమ్ము రూ. 3 కోట్లను స్వాహా చేసిన బ్యాంకు
  • 2007లో బ్యాంక్ చైర్మన్ సహా 27 మందిపై కేసు
  • ఇంకా పరారీలోనే బ్యాంకు చైర్మన్

డిపాజిటర్లను 3 కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో ఏలూరు ధనా బ్యాంకు చైర్మన్ సహా 21 మందికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే .. ధనా బ్యాంకు 2002లో మూడు కోట్ల రూపాయల మేర డిపాజిటర్ల సొమ్మును స్వాహా చేసింది. ఈ ఘటనపై 2007లో ఆ బ్యాంకు చైర్మన్ సహా 27 మందిపై కేసు నమోదైంది. వీరిలో ఐదుగురు చనిపోయారు. కీలక నిందితుడైన బ్యాంక్ చైర్మన్ పరారీలో ఉన్నాడు.

2013 నుంచి ఈ కేసులో విచారణ మొదలైంది. తాజాగా, నిందితులను దోషులుగా తేల్చిన ఏలూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి చింతలపూడి పురుషోత్తం కుమార్ తీర్పు వెల్లడించారు. దోషులు 21 మందికి పదేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం, వారిలో కొందరికి రూ. 10 వేలు, మరికొందరికి రూ. 5 వేలు చొప్పున జరిమానా కూడా విధించింది.

Dhana Bank
Eluru
Scam
  • Loading...

More Telugu News