Pradeep Ranganathan: యూత్ ను ఊపేసే హుషారైన బీట్ .. 'లవ్ టుడే' నుంచి 'పిల్లా పడేశావే' సాంగ్!

Love Today lyrical song released

  • కోలీవుడ్ లో హిట్ కొట్టిన 'లవ్ టుడే'
  • కథానాయికగా అలరించనున్న ఇవాన
  • యువన్ శంకర్ రాజా నుంచి ఆకట్టుకునే బీట్ 
  • ఈ నెల 25వ తేదీన విడుదలవుతున్న సినిమా 

కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమాల జాబితాలో 'లవ్ టుడే' కనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ నెల 4వ తేదీన అక్కడ విడుదలైన ఈ సినిమా చాలా వేగంగా 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. 

ఈ సినిమాకి దర్శకుడు .. హీరో రెండూ కూడా ప్రదీప్ రంగనాథన్ కావడం విశేషం. అతని జోడీగా ఇవాన అలరించనుంది. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం తమిళంలో పాప్యులర్ అయింది. ఆయన బాణీలో నుంచి ఒక తెలుగు పాటను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 

'పడేశావే పిల్లా పడేశావే' అంటూ ఈ పాట సాగుతోంది. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హరిచరణ్ ఆలపించాడు. కొరియోగ్రఫీని శాండీ అందించాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.

More Telugu News