Rana: తండ్రి కాబోతున్నట్టు వస్తున్న వార్తలపై రానా స్పందన

Rana reacts to fatherhood rumors

  • 2020లో పెళ్లి చేసుకున్న రానా, మిహీక
  • మిహీక గర్భవతి అంటూ ప్రచారం
  • రూమర్లను ఖండించిన మిహీక
  • తాజాగా గాయని కనికా కపూర్ ట్వీట్
  • అవన్నీ ఊహాగానాలే అని స్పష్టీకరణ

టాలీవుడ్ అగ్రనటుడు రానా దగ్గుబాటి భార్య మిహీక బజాజ్ గర్భవతి అని, రానా తండ్రి కాబోతున్నాడని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ నిరాధారమైన వార్తలని మిహీక బజాజ్ ఇప్పటికే ఖండించారు. 

అయితే, రానా తండ్రి కాబోతున్నాడంటూ గాయని కనికా కపూర్ ఓ ట్వీట్ చేయడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి రానా స్పందించారు. తన భార్య మిహీక గర్భవతి కాదని కనికా కపూర్ కు స్పష్టం చేశారు. మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని వివరించారు. అంతేకాదు, నాకు బిడ్డ పుడితే కచ్చితంగా చెబుతాను... అలాగే నీకు బిడ్డ పుడితే నువ్వు కూడా చెప్పాలి అంటూ కనికా కపూర్ ను ఉద్దేశించి రానా చమత్కరించారు. 

రానా, మిహీక జోడీ 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ప్రవేశించారు.

Rana
Miheeka Bajaj
Pregnancy
Child
Tollywood
  • Loading...

More Telugu News