Botsa Satyanarayana: చంద్రబాబు మాటలు అసహ్యంగా ఉంటున్నాయి: బొత్స సత్యనారాయణ

Chandrababu language is not good says Botsa

  • చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్న బొత్స 
  • ఆయనలా మాట్లాడటం మాకు కూడా వచ్చని కౌంటర్ 
  • పబ్లిసిటీ కోసం మాట్లాడాల్సిన అవసరం మాకు లేదని వ్యాఖ్య 

రాష్ట్రంలో సామాన్యుడికి న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహనం కోల్పోయి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలు చాలా నీచంగా ఉంటున్నాయని అన్నారు. సమాజం హర్షించని విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. జనాలు వైసీపీ వెనుక ఉన్నారనే చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని అన్నారు. 

మాట్లాడటం మాకు కూడా వచ్చని... అయితే రాజ్యాంగాన్ని గౌరవించి తాము అలా మాట్లాడటం లేదని చెప్పారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోసం మాట్లాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ప్రజలకు తాము ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని... ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకుంటే చాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి సభను వైసీపీ కార్యకర్తలంతా కలిసి విజయవంతం చేయాలని కోరారు.

Botsa Satyanarayana
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News