Priyadrshi: ఇక్కడ నో చెప్పడం పెద్ద కళ: కమెడియన్ ప్రియదర్శి

Priyadarshi Interview

  • కమెడియన్ గా ప్రియదర్శికి మంచి పేరు 
  • అడపా దడపా హీరోగాను వేషాలు
  • నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన 'జాతిరత్నాలు' 
  • నచ్చిన పాత్రలనే చేస్తానని వ్యాఖ్య

ప్రియదర్శి నటుడిగా మంచి పేరు సంపాదించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. 'మల్లేశం' .. 'జాతిరత్నాలు' వంటి సినిమాలు ఆయన స్థాయిని పెంచాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొని, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"ఇంతవరకూ కూడా నాకు తగిన పాత్రలనే చేస్తూ వచ్చాను. నాకు నచ్చకపోతే సున్నితంగానే 'నో' చెప్పేస్తాను. అయితే 'నో' చెప్పడం కూడా పెద్ద కళనే. ఎందుకంటే తలపొగరు అనేసి ప్రచారం చేస్తారు. ఈయన పెద్ద ఆర్టిస్టు .. ఈయనకి నచ్చాలట .. నిన్నగాక మొన్నొచ్చాడు అంటూ ఏదేదో అనేసుకుంటారు. 

అందువలన ఇక్కడ నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి. లేదంటే చాలా జరిగిపోతాయి. మరీ ఇబ్బందిగా అనిపిస్తే, మా మేనేజర్ రంగంలోకి దిగిపోయి, 'ఇప్పుడు కాదు లెండి .. మరోసారి చూద్దాం' అంటూ ఏదో మేనేజ్ చేసేస్తాడు. నటుడిగా కొంత గుర్తింపు వచ్చిన తరువాత కాస్త కోపాన్ని తగ్గించుకుని మరింత జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Priyadrshi
Rahul Ramakrishna
Open Heart With RK
  • Loading...

More Telugu News