delhi murder: సినిమాగా ఢిల్లీ హత్య కేసు!

movie based on Sradha murder case story

  • బాలీవుడ్ దర్శకుడు మనీష్ సింగ్ ప్రకటన
  • హు కిల్డ్ శ్రద్ధ వాకర్ పేరు ఖరారు చేసినట్లు వెల్లడి
  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు

ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధ వాకర్ ఉదంతాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును సినిమాగా మలిచేందుకు ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయట. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మనీష్ సింగ్ ఈ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘హు కిల్డ్ శ్రద్ధ వాకర్’ పేరును కూడా ఖరారు చేసినట్లు వివరించారు.

ముంబైకి చెందిన శ్రద్ధ వాకర్.. అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడిని ప్రేమించింది. అతడితో కలిసి జీవించడం ప్రారంభించింది. ఇంట్లోవాళ్లు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరూ కలిసి ఢిల్లీకి మారిపోయారు. ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఒకే ప్లాట్ లో సహజీవనం చేస్తున్నారు. తమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకుందామని ఒత్తిడి తేవడంతో శ్రద్ధ వాకర్ ను అఫ్తాబ్ చంపేశాడు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేశాడు. ఆరు నెలల తర్వాత బయటపడిన ఈ దారుణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ ఉదంతాన్ని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నట్లు డైరెక్టర్ మనీష్ సింగ్ వెల్లడించారు. బృందావన్ ఫిల్మ్స్ బ్యా నర్ పై ‘హు కిల్డ్ శ్రద్ధ వాకర్’ పేరుతో సినిమాను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రేమ ముసుగులో అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు.. శారీరక అవసరం తీరాక కొంతమంది అబ్బాయిలు సైకోలుగా ఎలా మారుతున్నారనే కోణంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మనీష్ సింగ్ చెప్పారు.

delhi murder
sradha
aftab
35 parts
movie
manish singh
  • Loading...

More Telugu News