Neha Chowdary: క్లాస్ మేట్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి

Bigboss contestant Neha Chowdary marrying her classmate
  • పెళ్లిపీటలు ఎక్కబోతున్న యాంకర్ నేహా చౌదరి
  • 13 ఏళ్ల నుంచి స్నేహితుడైన వ్యక్తిని పెళ్లాడనున్న నేహ
  • రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో నేషనల్ ఛాంపియన్ నేహ
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ నేహా చౌదరి పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ఇంజినీరింగ్ లో తన క్లాస్ మేట్, 13 ఏళ్ల నుంచి తనకు స్నేహితుడైన అనిల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. అనిల్ ఆరు అడుగుల ఎత్తు ఉంటాడని తెలిపింది. అయితే ఆయన ఫొటోను మాత్రం చూపించలేదు. 'నా పెళ్లి గోల మొదలైంది' అంటూ తన బ్లాగ్ లో ఒక వీడియో ద్వారా తనకు కాబోయే భర్తను గురించి తెలిపింది. మరోవైపు నేహకు అభిమానులు శుభాకాంక్షలు చెపుతున్నారు. 

ఇదిలావుంచితే, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు ఆమె నాగార్జునతో మాట్లాడుతూ... బిగ్ బాస్ షోకు వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పలు షోలకు యాంకరింగ్ చేసిన నేహా చౌదరి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తిరుపతికి చెందిన నేహకు క్రీడాకారిణిగా కూడా చాలా గుర్తింపు ఉంది. రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో ఆమె నేషనల్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది.
Neha Chowdary
Marriage
Anchor
Classmate

More Telugu News