Priyadarshi: అలా 'అర్జున్ రెడ్డి'లో చేసే ఛాన్స్ వచ్చింది: రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna Interview

  • 'పెళ్లి చూపులు'తో పరిచయమైన ప్రియదర్శి 
  • 'అర్జున్ రెడ్డి'తో ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ 
  • ఇద్దరూ పెరిగింది హైదరాబాదులోనే 
  • కలిసి నటించిన సినిమాలే ఎక్కువ

తెలుగు తెరపై కమెడియన్స్ గా రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి రాణిస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు .. అదృష్టం కొద్దీ ఇద్దరూ కలిసే ఎక్కువగా నటిస్తుంటారు. 'జాతిరత్నాలు' సినిమా వీరికి మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా ఇద్దరూ 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' లో పాల్గొన్నారు. తమ కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ఈ వేదిక ద్వారా పంచుకున్నారు. 

రాహుల్ రామక్రష్ణ మాట్లాడుతూ .. "నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్ లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నేను .. తరుణ్ భాస్కర్ .. విజయ్ దేవరకొండ .. ప్రియదర్శి అందరం కూడా సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుండే వాళ్లం. తరుణ్ భాస్కర్ తను చేస్తున్న 'పెళ్లి చూపులు' సినిమాలో ప్రియదర్శికి ఛాన్స్ ఇచ్చాడు.

అదే సమయంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి 'అర్జున్ రెడ్డి' సినిమా అనుకున్నాడు. ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ సినిమాలో 'శివ' పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. ఆ సినిమాలో నా పాత్రకి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు తెలిసింది, నా కంటే ముందుగా ఆ పాత్రకి ప్రియదర్శిని అనుకున్నారని" అంటూ చెప్పుకొచ్చాడు.

Priyadarshi
Rahul Ramakrishna
Vijay Devarakonda
  • Loading...

More Telugu News