Mahesh Babu: కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు వచ్చిన మహేశ్ బాబు

Mahesh Babu came to Vijayawada

  • తండ్రి అస్థికలను కృష్ణా నదిలో కలిపేందుకు వచ్చిన మహేశ్ 
  • ఆయన వెంట కుటుంబ సభ్యులు, దర్శకుడు త్రివిక్రమ్
  • హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మహేశ్

సినీ నటుడు మహేశ్ బాబు విజయవాడకు వచ్చారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలపడానికి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, హీరో సుధీర్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి కృష్ణానది దుర్గా ఘాట్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం వీరు తిరిగి హైదరాబాద్ కు బయల్దేరనున్నారు. మహేశ్ బాబు రాక నేపథ్యంలో పోలీసులు తగినంత భద్రతను ఏర్పాటు చేశారు.

Mahesh Babu
Tollywood
Vijayawada
Super Star Krishna
  • Loading...

More Telugu News