Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కంటికి శస్త్రచికిత్స

Eye surgery to President Droupadi Murmu

  • కంట్లో శుక్లాలతో బాధపడుతున్న ముర్ము
  • గత అక్టోబరులో ఎడమకంటికి శస్త్రచికిత్స
  • తాజాగా కుడికంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్
  • శస్త్రచికిత్స విజయవంతమైందన్న రాష్ట్రపతి భవన్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (64) కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స జరిగింది. ద్రౌపది ముర్ము నేడు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ముర్ము గత కొంతకాలంగా కుడికంట్లో శుక్లాలతో బాధపడుతున్నారు. వైద్యుల సలహాతో నేడు సర్జరీ చేయించుకున్నారు. 

కాగా, శస్త్రచికిత్స విజయవంతం అయిందని, ద్రౌపది ముర్ము డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ద్రౌపది ముర్ము అక్టోబరు నెలలో ఎడమకంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. తాజాగా కుడికంటికి శస్త్రచికిత్స చేసిన ఆర్మీ ఆసుపత్రి వైద్యులు శుక్లాలను విజయవంతంగా తొలగించారు.

Droupadi Murmu
President Of India
Eye Surgery
Cataract
  • Loading...

More Telugu News