GVL Narasimha Rao: మీ నాయకుడి ఆరాటం 'లోక' కల్యాణం కోసం కాదు 'లోకేశ్' కల్యాణార్థం!: అయ్యన్నపై జీవీఎల్ విమర్శలు

GVL condemns TDP leader Ayyanna comments

  • నిన్న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
  • నాడు శ్రీరాముడు అందరిసాయం తీసుకున్నాడన్న అయ్యన్న
  • చంద్రబాబు కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాలని సూచన
  • రాముడితో చంద్రబాబుకు పోలికా? అంటూ జీవీఎల్ ఆగ్రహం

రావణుడ్ని తాను ఒక్కడే వధించే సత్తా శ్రీరాముడికి లేకనా...? లోక కల్యాణం కోసం శ్రీరాముడు నాడు అందరి సాయం కోరాడు... ఇప్పుడు చంద్రబాబు కూడా రాష్ట్ర కల్యాణం కోసం అలాంటి నిర్ణయమే తీసుకోవాలంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. 

చంద్రబాబును భగవంతుడైన శ్రీరాముడితో పోల్చుతూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? అని ప్రశ్నించారు. మీ నాయకుడి ఆరాటం 'లోక' కల్యాణం కోసం కాదు 'లోకేశ్' కల్యాణార్థం అని అందరికీ తెలుసు అని జీవీఎల్ దెప్పిపొడిచారు. 

GVL Narasimha Rao
Ayyanna Patrudu
Chandrababu
Nara Lokesh
BJP
TDP
  • Loading...

More Telugu News