Vasanthi: 'బిగ్ బాస్'కి వెళ్లినవారు బరువు తగ్గడానికి అదే కారణం: వాసంతి

Vasanthi Interview

  • బిగ్ బాస్ లో బుట్టబొమ్మ అనిపించుకున్న వాసంతి 
  • తాను ఎవరితోనూ వెంటనే కలవలేనని వెల్లడి 
  • హౌస్ లోని వారికి సరిపోయే ఫుడ్ ఉంటుందని వివరణ 
  • కానీ టెన్షన్ వలన వంటబట్టదంటూ వ్యాఖ్య  

'బిగ్ బాస్ హౌస్'లో బుట్టబొమ్మ' .. 'గ్లామర్ క్వీన్' అనిపించుకున్న వాసంతి, రీసెంటుగా హౌస్ లో నుంచి బయటికి రావలసి వచ్చింది. హౌస్ నుంచి ఆమె వెళ్లిపోవడం వలన, ఆ షోలో గ్లామర్ తగ్గడం ఖాయమనే అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేశారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాసంతి మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించింది. "బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో టాప్ 5లో కాకపోయినా, ఆ తరువాత స్థానంలోనైనా ఉంటానని అనుకున్నాను. కానీ అలా జరగలేదు" అంది. 
  
బిగ్ బాస్ హౌస్ లో నేను 70 రోజుల పాటు ఉన్నాను .. నిజానికి ఇది సామాన్యమైన విషయమేం కాదు. ఏ వారం ఎవరు ఎలిమినేషన్ కావొచ్చు అనేది హౌస్ లో ఉన్న మాకు ఒక అంచనా అంటూ ఉండేది. కానీ ఎప్పుడైతే హౌస్ నుంచి సూర్య .. గీతూ వెళ్లిపోయారో, ఏ క్షణం ఎవరైనా బయటికి వెళ్లిపోవచ్చు అనే ఒక అభిప్రాయానికి వచ్చేశాము. హౌస్ లో నేను ఎవరితోను ఏ విషయాలను షేర్ చేసుకునేదానిని కాదు. ఎందుకంటే నా అంతటా నేనుగా వెళ్లి షేర్ చేసుకోవడమనేది నాకు అలవాటు లేదు" అంది. 

'బిగ్ బాస్ హౌస్'కి వచ్చిన వాళ్లంతా బరువు తగ్గుతూ ఉంటారు. హౌస్ లో ఉన్నవారికి సరిపోయేంత ఫుడ్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ అక్కడ ఉన్న మెంటల్ టెన్షన్ వలన, తిన్నది వంటబట్టదు. ఎవరికి వారు నెక్స్ట్ ఏం జరగనుంది? ఏం చేయాలి? అనే విషయాన్ని గురించే ఆలోచన చేస్తుంటారు. అందువలన అందరూ సన్నబడుతుంటారు. నేను 53 కేజీల నుంచి 47 కేజీలకు వచ్చేశాను. 6 కేజీల బరువు తగ్గడంతో నా డ్రెస్ లు కూడా నాకు లూజ్ అయ్యాయి" అంటూ చెప్పుకొచ్చింది.

Vasanthi
Surya
Geethu
Inaya
Bigg Boss
  • Loading...

More Telugu News