Marri Shashidhar Reddy: కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి సస్పెన్షన్

Marri Shashidhar Reddy suspended from Congress
  • శశిధర్ రెడ్డిని సస్పెండ్ చేసిన చిన్నారెడ్డి
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వేటు
  • బీజేపీలో చేరబోతున్న శశిధర్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సస్పెన్షన్ వేటు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నిన్ని శశిధర్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు కొంత కాలంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై శశిధర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధ పడుతోందని, ఆ క్యాన్సర్ ఇప్పట్లో నయమయ్యే అవకాశం లేదని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడాల్సి వస్తోందని... తనతో పాటు మరి కొందరు కాంగ్రెస్ నేతలు బయటకు వస్తున్నట్టు తెలిపారు.
Marri Shashidhar Reddy
Congress
Suspension
BJP

More Telugu News