Pradeep Ranganathan: కేరళ నుంచి దిగిపోయిన మరో బ్యూటీ 'ఇవాన'

Ivana Special

  • కేరళలో పుట్టిపెరిగిన 'ఇవాన' 
  • మలయాళ సినిమాతో ఎంట్రీ 
  • 2018లో కోలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ 
  • 'లవ్ టుడే'తో టాలీవుడ్ లోను పాగా వేసే ఛాన్స్      

ఈ మధ్య కాలంలో కేరళ బ్యూటీలు పొలోమంటూ టాలీవుడ్ లో దిగిపోతున్నారు. చాలా కాలం నుంచి వారి జోరే ఇక్కడ కొనసాగుతోంది. దాంతో బడ్జెట్ పరంగా భారీ సినిమాలు .. పారితోషికం పరంగాను భారీతనమే చూపించే టాలీవుడ్ కి కొత్త హీరోయిన్స్ రాక పెరుగుతూనే పోతోంది. ఇక అనువాద చిత్రాల ద్వారా పరిచయమైనా, ఆ తరువాత టాలీవుడ్ నుంచి ఛాన్సులు వస్తాయనే ఆశతో ఉన్నవారు కూడా చాలామందే ఉన్నారు. అలా కేరళ నుంచి మరో బ్యూటీ టాలీవుడ్ తెరపై మెరవబోతోంది. అందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ అమ్మాయి పేరే 'ఇవాన. కేరళలో పుట్టిపెరిగిన ఈ సుందరి, 2012 లోనే మలయాళ సినిమాల ద్వారా పరిచయమైంది. అక్కడ కొంత క్రేజ్ ను సంపాదించుకుని, 2018లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జీవి ప్రకాశ్ కుమార్ జోడీగా ఆమె పరిచయమైంది. 

ఇక రీసెంట్ గా తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఆమె చేసిన 'లవ్ టుడే' అక్కడ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన తెలుగులోను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ కి చెందిన చాలామంది కుర్రాళ్లు ఇవాన అభిమానులుగా మారిపోయారు. ఇక టాలీవుడ్ లోను అదే జరుగుతుందని అనిపిస్తోంది. ఈ సినిమా తరువాత ఆమె ఇక్కడ బిజీ కావడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది మరి.!

Pradeep Ranganathan
Ivana
Love Today Movie
  • Loading...

More Telugu News