Nothing Phone: భారీ తగ్గింపు ధరకు 'నథింగ్' ఫోన్!

Nothing Phone gets a price cut by Rs 6500 on Flipkart here is how much it costs now

  • 8జీబీ వెర్షన్ పై రూ.6,500 తగ్గింపు
  • దీంతో రూ.27,500కు తగ్గిన ధర
  • బ్యాంకు కార్డులపై రూ.1,500 డిస్కౌంట్
  • పాత ఫోన్ ఎక్సేంజ్ పై రూ.17,500 తగ్గింపు

వినూత్నమైన నథింగ్ (1) ఫోన్ గుర్తుందా..? దీని ధర ఎప్పుడు తగ్గుతుందా అని చూసే వారికి ఆ గుడ్ న్యూస్ రానే వచ్చింది. రూ.6,500 వరకు ధర తగ్గింది. దీంతో ఈ ఫోన్ ను ఇప్పుడు రూ.27,500కే సొంతం చేసుకోవచ్చు. నిజానికి నథింగ్ ఫోన్ ను రూ.32,999 ధరపై విడుదల చేశారు. జులైలో మరో రూ.1,000 పెంచడం జరిగింది. దీంతో రూ.34 వేలకు చేరింది. ఇప్పుడు దీనిపై రూ.6,500 తక్కువకే ఫోన్ ను కొనుగోలు చేసుకోవచ్చు. 

అంతే కాదండి ఇంకా ఉంది. దీనిపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫెడరల్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసే వారికి గరిష్ఠంగా రూ.1,500 తగ్గుతుంది. అంటే అప్పుడు రూ.26 వేలకు ఈ ఫోన్ వస్తుంది. ఒకవేళ పీఎన్ బీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ రూ.1,250గా ఉంటుంది. ఇక మీ వద్ద పాత ఫోన్ ఉంటే దాన్ని ఎక్చేంజ్ చేసుకోవడం ద్వారా మరో రూ.17,500 వరకు ధర తగ్గుతుంది. 

ఈ ధరలన్నీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీకి సంబంధించినవి. ఒకవేళ 12జీబీ వెర్షన్ కావాలంటే రూ.32,499 ధరకు లభిస్తోంది. దీనిపైనా బ్యాంకు కార్డుల ఆఫర్లు, ఎక్చేంజ్ ఆఫర్ అమలవుతాయి. ఫ్లిప్ కార్ట్ పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

More Telugu News