Nikki Galrani: అవునా! డెలివరీ తేదీ కూడా మీరే చెప్పేయండి: నిక్కీ గల్రానీ
![Nikki Galrani Pinisetty reveals if she is pregnant or not](https://imgd.ap7am.com/thumbnail/cr-20221119tn637843eb603d6.jpg)
- నిక్కీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు
- అలాంటిదేమీ లేదని కొట్టిపడేసిన నటి
- ఏదైనా ఉంటే తానే వెల్లడిస్తానన్న కన్నడ భామ
తాను ప్రెగ్నెంట్‌నంటూ వస్తున్న వార్తలపై కోలీవుడ్ ప్రముఖ నటి నిక్కీ గల్రానీ స్పందించారు. ఆమె గర్భం దాల్చిందని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై నిక్కీ స్పందించారు. అవి రూమర్లంటూ కొట్టిపడేసిన ఆమె.. 'డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి' అంటూ నవ్వుల ఎమోజీని పోస్టు చేశారు. ఇలాంటి రూమర్లను నమ్మొద్దని, ఏదైనా ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.