Vishwak Sen: బాలయ్య చేతుల మీదుగా 'ధమ్కీ' ట్రైలర్ రిలీజ్!

Dhamki Trailer Released

  • విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'ధమ్కీ'
  • దర్శక నిర్మాతగా మరో ప్రయోగం 
  • కథానాయికగా నివేద పేతురాజ్ 
  • ఫిబ్రవరిలో సినిమా విడుదల   

విష్వక్సేన్ తన కెరియర్ ఆరంభంలోనే తన సినిమాను తానే డైరెక్ట్ చేసుకున్నాడు. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు ఆయన హీరోగా ఆయన దర్శకత్వంలోనే మరో సినిమా రూపొందింది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు నిర్మాత కూడా ఆయనే. నివేద పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం బాలయ్య  చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.

ఈ సినిమాలో పదివేల కోట్ల రూపాయలతో రావు రమేశ్ నడుపుతున్న కంపెనీ ఇబ్బందుల్లో పడుతుంది. ఆ గండం నుంచి తనని గట్టెక్కించమంటూ, వెయిటర్ గా పనిచేస్తున్న హీరోను ప్రాథేయపడతాడు. ఒక సాధారణ వెయిటర్ ను ఒక శ్రీమంతుడు బ్రతిమాలడమే కథలోని ట్విస్ట్. అందుకు దారితీసిన పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

ఇక తాను కోటీశ్వరుడినని హీరోయిన్ కి అబద్ధం చెప్పి హీరో ఆమెను ముగ్గులోకి దింపుతాడనే విషయం కూడా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. 'నీ ఇంట్లో నా ఇంజన్' అనేది హీరో ఊతపదమనే విషయం అర్థమవుతోంది. ఇక హీరోను హీరోయిన్ 'గెటవుట్ ఆఫ్ మై కార్' అంటుంది. ఈ డైలాగ్ తో అందరూ ఈ సినిమాను గురించి మాట్లాడుకునేలా విష్వక్ ఓ ప్రయత్నం చేశాడని చెప్పచ్చు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News