Sudigali Sudheer: మీ అందరికీ రుణపడి ఉంటాను: సుడిగాలి సుధీర్

Gaalodu Pre Release Event

  • సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన 'గాలోడు'
  • తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • తాను సాధించినది అభిమానుల ప్రేమనే అంటూ వ్యాఖ్య 
  •  ఈ నెల 18న విడుదలవుతున్న సినిమా

బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చిన ఆర్టిస్టులలో సుధీర్ ఒకరు. సినిమాలలో ఒక వైపున ముఖ్యమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున హీరోగా తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక్కో సినిమా చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'గాలోడు' ఈ నెల 18వ తేదీన ఆడియన్స్ ను పలకరించనుంది. 

ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో సుధీర్ మాట్లాడుతూ .. " రెండున్నరేళ్ల పాటు ఈ సినిమా కోసం అందరం కష్టపడ్డాము.  మంచు ప్రాంతాల్లో .. ఆక్సిజన్ అందని ప్రాంతాల్లో నానా ఇబ్బందులు పడ్డాము. అయినా అందరూ అంకితభావంతో పనిచేయడం వల్లనే ఈ రోజున ఇంతమంచి అవుట్ పుట్ వచ్చింది" అన్నాడు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని నిన్న రాత్రినే అనుకున్నాము .. ఉదయాన్నే అందరికీ కాల్ చేశాను. ఒక్క కాల్ తోనే అందరూ కూడా వచ్చేశారు. అలాగే అభిమానులు కూడా చాలామంది వచ్చారు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? సినిమా సక్సెస్ కి మించిన ఆనందం నాకు ఇక్కడే దొరికేసింది'. ఇండస్ట్రీకి వచ్చి నేను సాధించినదేదైనా ఉందంటే అది మీ ప్రేమ .. అభిమానమే. నా జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటాను" అంటూ చెప్పుకొచ్చాడు.  

More Telugu News