Sudigali Sudheer: సుధీర్ 'గాలోడు' కాదు గట్టోడు: కేఎస్ రామారావు

Gaalodu Pre Release Event

  • 'గాలోడు' సినిమాతో వస్తున్న సుధీర్ 
  • హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • సుధీర్ పై ప్రశంసలు కురిపించిన కేఎస్ రామారావు 
  • 18వ తేదీన థియేటర్లకు వస్తున్న సినిమా  

సుధీర్ ఒక వైపున టీవీ షోస్ చేస్తూనే మరో వైపున హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినా, పట్టుదలతో ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రమైనా 'గాలోడు' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. కామెడీ .. క్రైమ్ ఇవన్నీ కూడా ఈ కథలో ఉండేలా ఆయన చూసుకున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ .. అనసూయ .. రష్మి .. ఆకాశ్ .. నందూ తదితరులు హాజరయ్యారు.
 
ఈ స్టేజ్ పై ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ .. " ఈ రోజుల ఇక్కడికి వచ్చిన తరువాత సుధీర్ ఫ్యామిలీ ఎంత పెద్దదో తెలిసింది. ఈ రోజున ఇక్కడికి ఇంతమంది ఆర్టిస్టులు వచ్చారంటే దానికి కారణం సుధీర్ పట్ల గల అభిమానమే కారణమని అనుకుంటున్నాను. చాలామంది హీరోల ఫంక్షన్స్ లో కనిపించనంతమంది స్టార్స్ ఈ రోజున ఇక్కడ కనిపిస్తుంటే సంతోషంగా ఉంది" అన్నారు. 

సుధీర్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే విషయం నాకు తెలుసు. ఆయన కాబోయే సూపర్ స్టార్ .. మాస్ స్టార్ అనే విషయం తెలుస్తూనే ఉంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి .. రామ్ ప్రసాద్ ఇద్దరూ కూడా సుధీర్ ను ఒక రేంజ్ లో చూపించి ఉంటారని భావిస్తున్నాను. విజయవాడ నుంచి వచ్చిన ఎంతోమంది హీరోలు స్టార్స్ అయ్యారు. అలాగే సుధీర్ స్టార్ అవుతాడని ఆశిస్తున్నాను. ఆయన గాలోడు కాదు .. గట్టోడు" అన్నారు. 

More Telugu News