Sumangali: అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో మహిళా లెక్చరర్ గొంతుకోసిన భర్త

Husband slit throat lecturer in Anantapur Arts College

  • అనంతపురంలో ఘటన
  • ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న సుమంగళి
  • భర్త పరేష్ తో విభేదాలు
  • ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్న వైనం

ఓ మహిళా లెక్చరర్ పై కట్టుకున్న భర్తే కత్తితో దాడికి యత్నించాడు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఈ కాలేజీలో సుమంగళి కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగానే కాలేజికి వచ్చిన ఆమెపై భర్త పరేష్ విరుచుకుపడ్డాడు. 

కాలేజీలోని కామర్స్ డిపార్ట్ మెంట్ భవనం వెలుపల కత్తితో దాడికి దిగడంతో, సుమంగళి గట్టిగా కేకలు వేసింది. దాంతో విద్యార్థులు, ఇతర లెక్చరర్లు పరుగున వచ్చి పరేష్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటికే అతడు గొంతుకోయడంతో తీవ్రంగా గాయపడిన మహిళా లెక్చరర్ ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు.   

దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఏడాదికాలంగా సుమంగళి, పరేష్ వేర్వేరుగా ఉంటున్నారని వెల్లడించారు. ఆమె తన భర్తపై గృహ హింస కేసు పెట్టిందని, విడాకులు కోరుతోందని వివరించారు.

Sumangali
Paresh
Attack
Anantapur Arts College
  • Loading...

More Telugu News