Sudigali Sudheer: 'గాలోడు' టైటిల్ తో రావడానికి గట్స్ ఉండాలి: అనిల్ రావిపూడి

Gaalodu Pre Release Event

  • సుధీర్ తాజా చిత్రంగా రూపొందిన 'గాలోడు' 
  • కథానాయికగా అలరించనున్న గెహెనా సిప్పీ
  • సంగీత దర్శకత్వం వహించిన భీమ్స్ 
  • రేపు థియేటర్లకు వస్తున్న సినిమా

సుధీర్ హీరోగా సంస్కృతి బ్యానర్ పై 'గాలోడు' సినిమా రూపొందింది. రాజశేఖర్ నిర్మించిన ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. గెహెనా సిప్పీ కథానాయికగా నటించిన ఈ సినిమా రేపు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదు .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనిల్ రావిపూడి గౌరవ అతిథిగా హాజరయ్యాడు. 

ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "సుధీర్ నాకు చాలా కాలంగా తెలుసు. నేను చేసిన 'సుప్రీమ్' సినిమాలోను తాను చేశాడు. తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకూ వచ్చాడు ... అది అనుకున్నంత తేలికైన విషయమేం కాదు. అందుకు ఆయనను అభినందిస్తున్నాను" అన్నాడు. 

 "ఈ మధ్య 'ఆహా' కోసం సుధీర్ తో కలిసి ఒక షో చేశాను. సుధీర్ కి ఎంత క్రేజ్ ఉందో .. ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యక్షంగా చూశాను.  సాధారణంగా హీరోగా కావడానికి చాలా గట్స్ ఉండాలి. అందునా ఇలాంటి ఒక టైటిల్ తో చేయడానికి ఇంకా గట్స్ కావాలి. దర్శకుడు రాజశేఖర్ గారికీ .. మంచి మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ కి విషెస్ చెబుతున్నాను" అంటూ ముగించాడు.

More Telugu News