Tamannaah: నాకు కాబోయే బిజినెస్ మ్యాన్ భర్తను చూస్తారా..? : తమన్నా

Tamannaah shuts down wedding rumours with her savage reply

  • పెళ్లి పుకార్లపై స్పందించిన మిల్కీ బ్యూటీ
  • అవును నిజమేనంటూ వ్యంగ్య సమాధానం
  • పురుషుడి వేషధారణతో కనిపించిన తమన్నా
  • తన జీవితానికి ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ రాస్తున్నారని అసహనం

టాలీవుడ్ నటి తమన్నా భాటియా ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటోందని తెగ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పెళ్లి నేపథ్యంలోనే కొత్త సినిమాలను ఆమె అంగీకరించడం లేదంటూ కథనాలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై తమన్నా స్పందించక తప్పలేదు. ఈ వార్తల్లో నిజం లేదని ఆమె తేల్చేసింది. అంతేకాదు వీటిని పుట్టిస్తున్న వారికి తగిన బదులిచ్చింది. 

దీనిపై ఇన్ స్టా గ్రామ్ లో తమన్నా స్పందన తెలియజేసింది. ముందు గ్రీన్ శారీతో కనిపించిన తమన్నా ఒక రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. ఆ తర్వాత అచ్చం పురుషుడి వేషధారణతో తలుపు తీసి కనిపించింది. ‘‘వ్యాపారవేత్త అయిన నా భర్తను పరిచయం చేస్తున్నాను.. పెళ్లి వదంతులు.. ప్రతి ఒక్కరూ నా జీవితానికి సంబంధించి స్క్రిప్ట్ రాస్తున్నారు’’అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇందుకు సంబంధించి వీడియోను పోస్ట్ చేసింది. తద్వారా తన పెళ్లిపై వచ్చినవన్నీ పుకార్లేనని ఆమె తేల్చేసింది. తమన్నా ప్రస్తుతం చిరంజీవితో కలసి 'భోళా శంకర్' సినిమాలో నటిస్తోంది. 

Tamannaah
wedding
rumours
shuts down
reply
  • Loading...

More Telugu News