Vijay Devarakonda: అవయవదానంపై ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda announces organ donation

  • మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో చిల్డ్రన్స్ డే కార్యక్రమం
  • హాజరైన విజయ్ దేవరకొండ
  • అవయవదానం చేస్తానని వెల్లడి
  • మరొకరికి ఆయుష్షు పోసినవాళ్లం అవుతామని వివరణ

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అవయవదానంపై ప్రకటన చేశారు. మాదాపూర్ పేస్ ఆసుపత్రిలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. తన మరణానంతరం అవయవాలను దానం చేస్తానని వెల్లడించారు.

తాను జీవించినంత కాలం అవయవాలను జాగ్రత్తగా కాపాడుకుంటానని తెలిపారు. దక్షిణాసియా దేశాల్లో అవయవదానం చేయడం చాలా తక్కువ అని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. అవయవాలు ఎంతో విలువైనవి అని, వాటిని మట్టిపాలు చేయడం కంటే, మరొకరికి దానం చేయడం ద్వారా వారికి ఆయుష్షు పోసినవాళ్లం అవుతామని వివరించారు. 

ఈ మేరకు విజయ్ దేవరకొండ వ్యాఖ్యల వీడియోను పేస్ హాస్పిటల్స్ సోషల్ మీడియాలో పంచుకుంది.

Vijay Devarakonda
Organ Donation
Pace Hospital
Hyderabad
Tollywood

More Telugu News