Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు... శరత్ చంద్రారెడ్డి భార్య కంపెనీ వివరాలు సేకరించిన ఈడీ
![Ed takes details of jet set go airlines and arrests sharat chandra reddy ind delhi liquor scam](https://imgd.ap7am.com/thumbnail/cr-20221116tn6374e0ea0de02.jpg)
- జెట్ సెట్ గో పేరిట చార్టర్డ్ విమానాలను నడుపుతున్న కనికా రెడ్డి
- అరెస్టైన శరత్ చంద్రారెడ్డి సతీమణే కనికా రెడ్డి
- ఈ విమానాల్లోనే లిక్కర్ స్కాం ముడుపులు తరలాయని ఈడీ అనుమానం
- జెట్ సెట్ గో వివరాలను అడిగిన ఈడీ
- ఏఏఐ అందించిన ఈ వివరాలతోనే శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న శరత్ చంద్రారెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా శరత్ చంద్రారెడ్డి అర్ధాంగి కనికా రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న జెట్ సెట్ గో ఎయిర్ లైన్స్ కంపెనీకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని ఈడీ కోరిన విషయం బుధవారం వెలుగు చూసింది.