Tamannaah: పెళ్లి పీటలు ఎక్కబోతున్న తమన్నా...?

Tamannaah to marry Mumbai businessman

  • ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటోందని సోషల్ మీడియాలో ప్రచారం
  • ఈ ప్రచారాన్ని ఇంతవరకు ఖండించని తమన్నా
  • ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్న మిల్కీ బ్యూటీ

టాలీవుడ్ అందాల భామ, మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది. ఈ కారణం వల్లే కొత్త సినిమాలను ఆమె అంగీకరించడం లేదని చెపుతున్నారు. మరోవైపు ఈ ప్రచారాన్ని ఇంతవరకు తమన్నా ఖండించలేదు. దీంతో, పెళ్లి వార్త నిజమేనని నెటిజెన్లు ఒక క్లారిటీకి వస్తున్నారు. త్వరలోనే పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. 

ముంబైకి చెందిన తమన్నా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 14 ఏళ్ల వయసులోనే నటించడం ప్రారంభించిన తమన్నా... ప్రస్తుతం 'భోళా శంకర్' చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. దీంతోపాటు, ఓ తమిళ చిత్రాన్ని కూడా చేస్తోంది.

Tamannaah
Tollywood
Bollywood
Marriage
  • Loading...

More Telugu News