Prabhas: మహేశ్ బాబుతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రభాస్... వీడియో ఇదిగో!

Prabhas talks to Mahesh Babu

  • సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం
  • తీవ్ర విషాదంలో టాలీవుడ్
  • మహేశ్ బాబును పరామర్శిస్తున్న ప్రముఖులు
  • కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రభాస్

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని నివాసంలో ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్... కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మహేశ్ బాబుతో ప్రత్యేకంగా మాట్లాడారు. తండ్రి మరణంతో తీవ్రమైన వేదనలో ఉన్న మహేశ్ ను ప్రభాస్ ఓదార్చారు. 

ప్రభాస్ తో పాటు యువ హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు మెహర్ రమేశ్, సంగీత దర్శకుడు తమన్ కూడా మహేశ్ ను కలిసి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు... తన తండ్రి మరణానికి దారితీసిన పరిస్థితులను వారికి వివరించారు.

Prabhas
Mahesh Babu
Krishna
Demise
Tollywood

More Telugu News