Tollywood: కృష్ణ మృతికి సంతాపంగా రేపు విజయవాడలో సినిమా షోల బంద్

cinema shows in vijayawada cancelled tomorrow
  • విజయవాడతో కృష్ణకు మంచి అనుబంధమన్న ఫిలిం ఛాంబర్
  • నగర వ్యాప్తంగా రేపు సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన
  • సినీ అభిమానులు సహకరించాలని విజ్ఞప్తి
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ కీలక ప్రకటన చేసింది. కృష్ణ మృతికి సంతాపంగా రేపు (బుధవారం) విజయవాడ నగర పరిధిలోని అన్ని సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. సినీ అభిమానులు అందుకు సహకరించాలని కోరింది. విజయవాడతో కృష్ణకు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛాంబర్ తన ప్రకటనలో వెల్లడించింది.

ఇదిలా ఉంటే...కృష్ణ మృతికి సంతాపంగా రేపు సినిమా షూటింగ్ లను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. కృష్ణ మృతికి సంతాపంగా రేపు సినీ పరిశ్రమ కార్యకలాపాలు, షూటింగ్ లు రద్దు చేసుకోవాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన విజ్ఞప్తి మేరకే నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Tollywood
Krishna
Vijayawada
Cinema Shows

More Telugu News