Allu Arjun: మహేశ్ బాబుకు అల్లు అర్జున్ ఆత్మీయ పరామర్శ... వీడియో ఇదిగో!

Allu Arjun consoles Mahesh Babu

  • సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం
  • నానక్ రామ్ గూడ నివాసంలో భౌతికకాయం
  • నివాళులు అర్పించిన అల్లు అర్జున్
  • మహేశ్ ను హత్తుకుని ఓదార్చిన వైనం

హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో విషాద వాతావరణం నెలకొంది. కృష్ణ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా కృష్ణ నివాసానికి వచ్చారు. తీవ్ర విచారంతో ఉన్న కృష్ణ తనయుడు మహేశ్ బాబును ఆత్మీయంగా హత్తుకుని పరామర్శించారు. 

అనంతరం కృష్ణ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తర్వాత మహేశ్ బాబు పక్కనే కూర్చుని ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు, యువ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు.

Allu Arjun
Mahesh Babu
Krishna
Demise
Tollywood
Superstar

More Telugu News