super star: కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు, చంద్రబాబు, కేటీఆర్ తదితరులు

Chandrababu paid tribute to Krishnas

  • మహేశ్ బాబును ఓదారుస్తున్న ప్రముఖులు
  • పక్కనే కూర్చొని ధైర్యం చెప్పిన చిరంజీవి
  • వెంకటేశ్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, బన్నీ తదితరుల నివాళి  

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ నానక్ రాం గూడలోని కృష్ణ నివాసానికి ప్రముఖులు వరుస కడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేశ్ బాబు, నరేశ్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కృష్ణ నివాసంలో ఆయన భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. 

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, దర్శకులు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, మంచు విష్ణు తదితరులు కూడా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేశ్ చాలాసేపు మహేశ్ బాబు పక్కనే కూర్చొని ధైర్యం చెప్పారు. త్రివిక్రమ్.. మహేశ్ పక్కనే ఉన్నారు.  నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కృష్ణ నివాసంలోనే ఉండి ప్రముఖులను రిసీవ్ చేసుకుంటున్నారు.



super star
krishna
Chandrababu
paid
tribute
Chiranjeevi
KTR
Pawan Kalyan
  • Loading...

More Telugu News