Tollywood: సూపర్​ స్టార్​ కృష్ణ అందుకున్న అవార్డులు ఇవే

Superstar Krishna awards list

  • ఐదు దశాబ్దాల నట జీవితంలో 350కిపైగా చిత్రాలు చేసిన కృష్ణ
  • సూపర్ స్టార్ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం
  • ఆయన నటన, సేవలకు వరించిన పలు అవార్డులు

టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఇక లేరనే వార్త ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గూడు కట్టుకున్నారు. తన నటనతోపాటు నిర్మాతగాను ఆయన తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు. ఆయన నటన, చిత్రపరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయనను పలు అవార్డులు వరించాయి. 

-1974లో అల్లూరి సీతారామరాజు చిత్రానికి నంది అవార్డు.
-1997లో ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం (దక్షిణాది) లభించింది.
-2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కింది.
-2008లో ఆంధ్రా విశ్వవిద్యాలయం కృష్ణను గౌరవ డాక్టరేట్ తో గౌరవించింది
-2009లో కేంద్ర ప్రభుత్వం భారత మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ప్రకటించింది.

Tollywood
super star
krishna
awards
  • Loading...

More Telugu News