Shiva karthikeyan: డిస్నీ హాట్ స్టార్ వేదికపైకి 'ప్రిన్స్' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Prince movie will release in Hotstar on 25th November
  • తెలుగు .. తమిళ భాషల్లో వచ్చిన 'ప్రిన్స్'
  • కామెడీని నమ్ముకుని అనుదీప్ చేసిన మరో మూవీ 
  • అక్టోబర్ 21వ తేదీన విడుదలైన సినిమా
  • ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 
కోలీవుడ్ లో ఇప్పుడు హీరోగా శివకార్తికేయన్ దూకుడు మీద ఉన్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆయనతో సినిమాలు చేయడానికి అక్కడి మేకర్స్ పోటీపడుతున్నారు. ఇటీవలే ఆయన నుంచి 'ప్రిన్స్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. 

సునీల్ నారంగ్ .. సురేశ్ బాబు .. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి అనుదీప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో కథానాయికగా ఉక్రెయిన్ భామ మరియా పరిచయమైంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలుకానున్నట్టు ప్రకటించారు.

'జాతిరత్నాలు' సాధించిన సక్సెస్ కారణంగా, అదే డైరెక్టర్ నుంచి వచ్చిన 'ప్రిన్స్' పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. అనుదీప్ తనకి బాగా పట్టున్న కామెడీనే నమ్ముకుని ఈ సినిమాను రూపొందించాడు. అయితే ఆ కామెడీ ఆశించిన స్థాయిలో పేలలేదు. మరి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.
Shiva karthikeyan
Maria
Anudeep
Prince Movie

More Telugu News