Etela Rajender: హైకమాండ్ నుంచి పిలుపు.. ఢిల్లీకి వెళ్లిన ఈటల, కోమటిరెడ్డి

Etela and Komatireddy leaves to Delhi

  • అమిత్ షాతో భేటీ కానున్న ఈటల, కోమటిరెడ్డి
  • ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న డీకే అరుణ
  • తెలంగాణలో పార్టీ బలోపేతంపై మార్గనిర్దేశం చేయనున్న అమిత్ షా

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఢిల్లీకి బయల్దేరారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఇద్దరూ హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. ఢిల్లీలో వీరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి ఓటమిపాలయినప్పటికీ బీజేపీకి భారీ ఎత్తున ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు 96,598 ఓట్లు రాగా... కోమటిరెడ్డికి 86,485 ఓట్లు వచ్చాయి. దీంతో, బీజేపీ శ్రేణులు సంతోషంగా ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి వీరికి అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే డీకే అరుణ ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బీజేపీ శిక్షణా తరగతులు జగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

Etela Rajender
Komatireddy Raj Gopal Reddy
Amitabh Bachchan
DK Aruna
BJP
Delhi
  • Loading...

More Telugu News