Ram Gopal Varma: బాధ పడాల్సిన అవసరం లేదు.. వీరిద్దరూ స్వర్గంలో సంతోషంగా ఉంటారు: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma response on Krishna death

  • కృష్ణ మృతి పట్ల రామ్ గోపాల్ వర్మ ట్వీట్
  • కృష్ణ, విజయనిర్మల స్వర్గంలో ఆడుతూ, పాడుతూ ఉంటారన్న వర్మ
  • 'మోసగాళ్లకు మోసగాళ్లు' సినిమాలో పాటను పోస్ట్ చేసిన వైనం

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టయిలే వేరు. ఇతరులకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. కృష్ణ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులందరూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తుంటే... వర్మ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు.

కృష్ణ గారు, విజయనిర్మల గారు స్వర్గంలో ఆడుతూ, పాడుతూ సంతోషకరమైన సమయాన్ని గడుపుతుంటారని... అందువల్ల మనం బాధ పడాల్సిన అవసరం లేదని వర్మ అన్నారు. అంతేకాదు... 'మోసగాళ్లకు మోసగాళ్లు' చిత్రంలో కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన 'కోరినది నెరవేరినది' పాటను షేర్ చేశారు.

More Telugu News