Karthi: హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్

Actor Karthi Facebook account hacked

  • తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలిపిన కార్తీ
  • ఎఫ్బీ టీమ్ తో కలసి పని చేస్తున్నామని వెల్లడి
  • ప్రస్తుతం 'జపాన్' సినిమాలో నటిస్తున్న కార్తీ

తమిళ హీరో కార్తీ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన 'విరుమన్', 'పొన్నియన్ సెల్వన్ 1', 'సర్దార్' చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. మరోవైపు కార్తీ ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురయింది. ఈ విషయాన్ని కార్తీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

తన ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయిందని... ప్రస్తుతం ఫేస్ బుక్ టెక్నికల్ టీమ్ తో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే అకౌంట్ ను తిరిగి పొందేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం కార్తీ 'జపాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Karthi
Tollywood
Kollywood
Facebook
Hack
  • Loading...

More Telugu News