Gujarat election: నామినేషన్ కార్యక్రమంలో భార్య వెంటే క్రికెటర్ జడేజా

Gujarat election Ravindra Jadeja accompanies wife Rivaba to Jamnagar BJP event

  • గుజరాత్ లోని జామ్ నగర్ నార్త్ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా రివబా జడేజా
  • నామినేషన్ దాఖలు చేయడానికి ముందు బీజేపీ కార్యక్రమం
  • భార్యతో కలసి పాల్గొన్న జడేజా

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివబా జడేజా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు బీజేపీ జామ్ నగర్ లో కార్యక్రమాన్ని నిర్వహించింది. రివబా తన భర్త రవీంద్ర జడేజాతో కలసి కార్యక్రమానికి విచ్చేశారు. వచ్చే నెల 1, 5వ తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రెండు దశల్లో జరగనున్న సంగతి తెలిసిందే. 8న ఫలితాలు వెలువడతాయి. జామ్ నగర్ నార్త్ స్థానానికి రివబా అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. 

దీనిపై రవీంద్ర జడేజా జామ్ నగర్ ఓటర్లకు విజ్ఞప్తి కూడా చేశాడు. ‘‘నా ప్రియమైన జామ్ నగర్ నివాసులు, క్రికెట్ అభిమానులారా.. ఇక్కడ గుజరాత్ ఎన్నికలు టీ20 క్రికెట్ మాదిరి వేగంగా కొనసాగుతున్నాయని తెలిసిందే. నా భార్య రివబాను బీజేపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. నవంబర్ 14న ఆమె నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుంది. విజయానికి అనుకూలమైన వాతావరణం కల్పించే బాధ్యత మీపైనే ఉంది. రేపు ఉదయం కలుసుకుందాం’’ అంటూ ఆదివారం జడేజా ట్వీట్ చేయడం గమనార్హం.

More Telugu News