Samantha: 3 రోజుల్లో 'యశోద' ఎంత రాబట్టిందంటే .. !

Yashoda Movie Update

  • ఈ నెల 11వ తేదీన విడుదలైన 'యశోద'
  • హైలైట్ గా నిలిచిన సమంత నటన 
  • తొలిరోజునే 6 కోట్లకి పైగా వసూళ్లు  
  • శని, ఆది వారాల్లో కలుపుకుని 10.20 కోట్లు 

సమంత టైటిల్ రోల్ ను పోషించిన 'యశోద' ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. రిలీజ్ కి ముందువరకూ ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ టీజర్ .. ట్రైలర్ వదిలిన దగ్గర నుంచి, ఈ కథలో ఏదో కొత్త పాయింట్ ఉందనే విషయం జనాలకి అర్థమైంది. దాంతో తొలి రోజున భారీ ఓపెనింగ్స్ తో షోస్ మొదలయ్యాయి. తొలి ఆట పూర్తయిన వెంటనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.
 
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి హరి - హరీశ్ దర్శకత్వం వహించారు. సరోగసి పేరుతో మురికివాడల్లోని యువతులను మభ్యపెట్టి, శిశువుల నేపథ్యంలో జరిగే కథ ఇది. కథ మొదలైన తరువాత సమస్య అర్థం కావడానికి 'యశోద'కి కొంత సమయం పడుతుంది. ప్రేక్షకుడికి పట్టే సమయం కూడా అదే. ఇక అప్పటి నుంచి కథ స్పీడ్ అందుకుంటుంది.

తెలుగుతో పాటు మలయాళ ... కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేశారు. తొలిరోజునే 6 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, శని - ఆది వారాల్లో కలుపుకుని 10.20 కోట్లను రాబట్టింది. మరో రెండు వారాల వరకూ ఇక్కడ చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడం వలన, ఇప్పట్లో 'యశోద' వసూళ్లపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చుననే టాక్ వినిస్తోంది.

Samantha
Unni Mukundan
Varalakshmi
Yashoda Movie
  • Loading...

More Telugu News