USA: తనకంటే మూడేళ్లు చిన్నవాడైన ప్రేమికుడితో జో బైడెన్ మనవరాలి పెళ్లి

Joe Biden granddaughter Naomi to get married at White House
  • ఈ శనివారం వైట్ హౌస్‌ లో వివాహ వేడుక
  •  నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నయోమీ
  • వైట్ హౌస్‌ లో అధ్యక్షుడి మనవరాలి పెళ్లి జరగడం ఇదే తొలిసారి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నయోమీ బైడెన్ వివాహం వచ్చే శనివారం వైట్ హౌస్ సౌత్ లాన్‌లో జరగనుంది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టభద్రుడైన పీటర్ నీల్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఓ ప్రెసిడెంట్ మనవరాలు వైట్ హౌస్‌లో పెళ్లి కూతురుగా నడవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే, వైట్ హౌస్‌లో ఇది 10వ డాక్యుమెంట్ వెడ్డింగ్ అవనుంది. ఇక్కడ ఇప్పటికే 18 వివాహాలు జరిగాయి. వాటిలో మెజారిటీ అధ్యక్షుడి కుమార్తెల పెళ్లి వేడుకలే ఉన్నాయి.  

వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రకారం ఈ ప్రదేశంలో అమెరికా అధ్యక్షుడి మనవరాలి వివాహం జరగనుండటం ఇదే తొలిసారి. జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ కుమార్తె అయిన 28 ఏళ్ల నయోమీ తనకంటే మూడేళ్లు చిన్నవాడైన నీల్ (25 ఏళ్లు)తో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. నయోమీ న్యాయవాద వృత్తిలో ఉండగా.. నీల్ ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లా స్కూల్ నుండి పట్టభద్రుడయ్యారు. వారిద్దరూ వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు.
USA
Joe Biden
granddaughter
Naomi Biden
marriage
white house

More Telugu News