Krishna: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంపై నరేశ్ వివరణ

Krishnas health is stable says Naresh

  • కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ
  • కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందన్న నరేశ్
  • 24 గంటల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడి

సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురయింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

మరోవైపు, కృష్ణ అనారోగ్యంపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. శ్వాస సంబంధ సమస్యలతో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 24 గంటల తర్వాత ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు.

Krishna
Super Star
Health
Naresh
  • Loading...

More Telugu News