80s Actors: ముంబయిలో కలిసిన 80వ దశకం తారలు... ఆతిథ్యమిచ్చిన జాకీష్రాఫ్, పూనమ్ థిల్లాన్

80s actors reunion held in Mumbai

  • ప్రతి ఏడాది కలుస్తున్న సీనియర్ తారలు
  • క్రమం తప్పకుండా హాజరవుతున్న చిరంజీవి తదితరులు
  • ఈసారి ముంబయిలో సంబరాలు
  • దక్షిణాది తారలకు జత కలిసిన బాలీవుడ్ సీనియర్లు

దక్షిణాదిలో వివిధ భాషల చిత్ర పరిశ్రమలకు చెందిన సీనియర్ నటులు ప్రతి ఏడాది కలుసుకుని వేడుకలు జరుపుకోవడం తెలిసిందే. 80వ దశకంలో అభిమానులను విశేషంగా అలరించిన ఈ తారల్లో మెగాస్టార్ చిరంజీవి, భాగ్యరాజా, అర్జున్, వెంకటేశ్, శరత్ కుమార్, నరేశ్, భానుచందర్ వంటి హీరోలు... రాధ, సుహాసిని, కుష్బూ, సుమలత, శోభన, అంబిక, సరిత, రేవతి, లిజి, నదియా వంటి వారు ఉన్నారు. వీరందరూ క్రమం తప్పకుండా కలుస్తుంటారు. 

ఈ ఏడాది వీరి కలయికకు ముంబయి వేదికగా నిలిచింది. ఈసారి వీరికి బాలీవుడ్ సీనియర్ తారలు కూడా జత కలిశారు. ఈ ఆహ్లాదకర వేడుకకు బాలీవుడ్ స్టార్లు జాకీష్రాఫ్, పూనమ్ థిల్లాన్ ఆతిథ్యమిచ్చారు. 

అంతేకాదు, ఈ సంబరాల్లో అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్, మీనాక్షి శేషాద్రి, విద్యాబాలన్ తదితరులు కూడా పాల్గొన్నారు. వీరందరూ ఉల్లాసంగా ఆడిపాడారు. విందు వినోదాలతో ఆనందంగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, 80వ దశకం తారలు ఇలా కలవడం ఇది 11వ సారి.

80s Actors
Reunion
Mumbai
South
Film Industry

More Telugu News