Congress: నరేంద్ర మోదీ స్టేడియం పేరును మారుస్తాం: గుజరాత్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలక హామీలు

Gujarat Congress Manifesto

  • గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
  • 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ
  • రూ. 3 లక్షల వరకు రైతు రుణమాఫీ

అహ్మదాబాద్ లోని క్రికెట్ స్టేడియంకు నరేంద్ర మోదీ పేరును తీసేసి సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ గెలిస్తే తొలి కేబినెట్ మీటింగ్ లోనే ఈ మేనిఫెస్టోను అధికారిక డాక్యుమెంట్ గా మారుస్తామని చెప్పారు.

రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, ఒంటరి మహిళ, వితంతువు, వృద్ధ మహిళలకు నెలకు రూ. 2 వేల పెన్షన్, 3 వేల ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అమ్మాయిలకు ఉచిత విద్యుత్, రూ. 3 లక్షల వరకు రైతు రుణాల మాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల భృతి, రూ. 500కే గ్యాస్ సిలిండర్ తదితర హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. డిసెంబర్ 1న, 5న గుజరాత్ లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 8న కౌంటింగ్ జరుగుతుంది.

Congress
Gujarat
Assembly Elections
Manifesto
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News