Pawan Kalyan: పవన్ కల్యాణ్ కారు టాప్ ఎక్కి ప్రయాణించడంపై కేసు నమోదు

Case files on Pawan Kalyan Car Top journey

  • ఇటీవల ఇప్పటం గ్రామానికి వచ్చిన పవన్
  • కారు టాప్ పై కాళ్లు బారచాపుకుని ప్రయాణించిన వైనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన శివకుమార్ అనే వ్యక్తి
  • పలు సెక్షన్లతో కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించడం తెలిసిందే. ఇప్పటం వచ్చే క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దాంతో కొద్దిదూరం కాలినడకన పయనించిన పవన్, తదనంతర పరిణామాల నేపథ్యంలో కారు టాప్ పై కూర్చుని, కాళ్లు బారచాపుకుని ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

అయితే, దీనిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శివకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ 336, రెడ్ విత్ 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. టాప్ పైన కూర్చుని ప్రయాణించడం ప్రమాదకరం అని ఫిర్యాదుదారుడు శివకుమార్ పేర్కొన్నారు. ఆ సమయంలో పవన్ కాన్వాయ్ ని అనేక వాహనాలు అనుసరించాయని, రాష్ డ్రైవింగ్ చోటుచేసుకుందని వివరించారు.

Pawan Kalyan
Car Top
Case
Police
Ippatam
Janasena
  • Loading...

More Telugu News