Australia: నౌకలో 800 మందికి కరోనా

800 Test Positive On Cruise Ship

  • ఆస్ట్రేలియాలో కలకలం రేపిన విహార యాత్ర
  • వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి నౌక మొత్తం క్వారంటైన్ లోనే..
  • సిడ్నీ తీరంలోనే ఆపేసిన క్రూయిజ్ షిప్

విహారయాత్రకు బయలుదేరిన ఓ క్రూయిజ్ షిప్ లో కరోనా కలకలం రేపింది. ప్రయాణికుల్లో ఏకంగా 800 మందికి వైరస్ పాజటివ్ గా తేలడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. వెంటనే ఆ మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌకను న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని సిడ్నీ తీరంలో నిలిపేశారు. కార్నివాల్ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిందీ నౌక. ప్రయాణికులు అందరినీ అందులోనే క్వారంటైన్ లో పెట్టారు. కరోనా బాధితులను నౌకలోనే ఐసోలేషన్ లో ఉంచామని, నౌక వైద్య బృందం వారికి అవసరమైన చికిత్స అందిస్తోందని కార్నివాల్ ఆస్ట్రేలియా కంపెనీ వెల్లడించింది. ఇటీవల కేసులు పెరుగుతుండడంతో తమ నౌకలలో కరోనా ప్రొటోకాల్ ను అమలు చేస్తున్నామని కంపెనీ ప్రెసిడెంట్ మార్గరెట్ ఫిట్జెరాల్డ్ తెలిపారు.

వైరస్ బయటపడ్డ 2020 సంవత్సరంలో ఇదే న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఓ నౌకలో కరోనా కలకలం రేగింది. రూబీ ప్రిన్సెస్ పేరుతో నడిచే నౌకలో సుమారు 914 మందికి కరోనా సోకగా.. 28 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. పాత అనుభవం నేపథ్యంలో ఇప్పుడు మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌకలో నుంచి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చే మార్గాలను పరిశీలిస్తున్నట్లు ఆస్ట్రేలియా అంతర్గత వ్యవహారాల మంత్రి క్లేర్ ఓ నెయిల్ మీడియాకు తెలిపారు.

Australia
ship
COVID19
virus
positive
cruise
  • Loading...

More Telugu News