Narendra Modi: సభాస్థలికి చేరుకున్న మోదీ.. శాలువాతో సత్కరించిన జగన్

Modi and Jagan reaches OU ground

  • ఏయూ గ్రౌండ్ లో భారీ బహిరంగసభ
  • ప్రధానితో పాటు వచ్చిన గవర్నర్, సీఎం
  • స్టాళ్లను పరిశీలించిన ప్రధాని

విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో ఆయన సభాస్థలికి విచ్చేశారు. ఆయనతో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా మోదీకి కీలక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధానికి జగన్ శాలువా కప్పి సత్కరించారు. శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. 

అనంతరం సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రధాని వీక్షించారు. కాసేపట్లో ఆయన పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన పనులను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.

Narendra Modi
BJP
Jagan
YSRCP
Biswabhusan Harichandan
Vizag
  • Loading...

More Telugu News