Allu Arjun: తన డ్రైవర్ ఇల్లు కట్టుకుంటుంటే రూ.15 లక్షలు అందించిన అల్లు అర్జున్

Allu Arjun donates Rs 15 Lakhs to his driver

  • బన్నీ వద్ద పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్న మహిపాల్
  • బోరబండలో ఇల్లు కట్టుకుంటున్న మహిపాల్
  • స్వయంగా ఆర్థిక సాయం అందించిన బన్నీ

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాతృత్వంలోనూ ముందుంటారు. ఎవరైనా సాయం కోరితే కాదనలేరు. ఇక తన వద్ద పనిచేసే సిబ్బందికి ఆయన అన్నివిధాలా అండదండలు అందిస్తారు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది. 

అల్లు అర్జున్ వద్ద బోరబండ వాసి మహిపాల్ గత పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మహిపాల్ స్వస్థలం వరంగల్. నమ్మకంగా ఉండడంతో అల్లు అర్జున్ అతడ్ని తన వ్యక్తిగత డ్రైవర్ గా కొనసాగిస్తున్నారు. 

కాగా, మహిపాల్ బోరబండలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ తన డ్రైవర్ కు రూ.15 లక్షలు అందించారు. మహిపాల్ కుటుంబ సభ్యులను కలిసి ఈ మేరకు ఆర్థికసాయం అందించి వారిని సంతోషంలో ముంచెత్తారు. దీనికి సంబందించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Allu Arjun
Mahipal
Driver
Tollywood
  • Loading...

More Telugu News