Lavanya Tripathi: స్పీడ్ పెంచిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi speeds up her career

  • తెలుగులో సైకలాజికల్ థ్రిల్లర్ లో నటిస్తున్న లావణ్య
  • తమిళ్ లో అధర్వతో చిత్రం దాదాపు పూర్తి
  • జీ5 వెబ్ సిరీస్ లో నటిస్తున్న అమ్మడు

అటు అందం, ఇటు అభినయ సామర్థ్యం పుష్కలంగా ఉన్న నటి లావణ్య త్రిపాఠి. దక్షిణాది భాషల్లో విశేష రీతిలో అవకాశాలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మంజునాథ దర్శకత్వంలో లావణ్య సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. అటు, తమిళంలో హీరో అధర్వతో నటిస్తున్న సినిమా రెండు పాటలు మినహా పూర్తయింది.

ఓటీటీ రంగంలోనూ లావణ్య తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె నటించిన జీ5 'పులి మేక' థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొనా వెంకట్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఒక తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా, ఓ తెలుగు వెబ్ సిరీస్ తో వైవిధ్యంగా ముందుకెళ్తున్న లావణ్య త్రిపాఠి త్వరలోనే రెండు ప్రాజెక్టులు అనౌన్స్ చేయనుంది. 

నవీన్ చంద్ర సరసన 'అందాల రాక్షసి' చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత భలే భలే మగాడివోయ్, మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఉన్నది ఒకటే జిందగీ, అర్జున్ సురవరమ్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది ఆమె మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో 'హ్యాపీ బర్త్ డే' చిత్రంలో నటించింది.

Lavanya Tripathi
Movies
Heroine
Tollywood
Kollywood
Web Series
  • Loading...

More Telugu News