: అమెరికాలో మళ్లీ విరుచుకుపడ్డ టోర్నడోలు
వారం రోజుల వ్యవధిలోనే అమెరికాలోని ఓక్లహోమ పట్టణంపై టోర్నడో(బలమైన గాలులు, దట్టమైన మేఘాలతో కూడిన వర్షం)లు మరోసారి విరుచుకుపడ్డాయి. దీంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయని సమాచారం. ఐదుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయాలపాలై ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. మే 20న టోర్నడోలు కలిగించినంత నష్టం ఈసారి ఉండదని అధికారులు వెల్లడించారు.