Vishwak Sen: 'ఆహా'లో స్ట్రీమింగుకి రెడీ అవుతున్న 'ఓరి దేవుడా'

Ori Devuda Premieres tonight at 12 AM

  • విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'ఓరి దేవుడా'
  • ప్రత్యేకమైన పాత్రలో నటించిన వెంకటేశ్ 
  • క్రితం నెల 21న థియేటర్లకు వచ్చిన సినిమా
  • ఈ రోజు రాత్రి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్

విష్వక్సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమా తెరకెకెక్కిన సంగతి తెలిసిందే. పీవీపీ వారు నిర్మించిన ఈ సినిమా, క్రితం నెల 21వ తేదీన విడుదలైంది. అశ్వథ్  మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే వెంకటేశ్ ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో నటించడమనేది కొంతవరకూ కలిసొచ్చింది. 

అలాంటి ఈ సినిమా ఈ రోజు రాత్రి 12 గంటలకు .. అంటే తెల్లవారితే శుక్రవారమనగా, 'ఆహా' స్ట్రీమింగ్ జరుపుకోనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ కూడా వచ్చేసింది. ఈ సినిమాలో విష్వక్ సరసన మిథిల పాల్కర్ - ఆషా భట్ అలరించారు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో మురళీ శర్మ.. నాగినీడు .. రాహుల్ రామకృష్ణ కనిపిస్తారు. 

లవ్ .. ఎమోషన్ తో నడిచే ఫ్యామిలీ డ్రామా ఇది. సరదాగా ఈ కథలోకి దైవాన్ని కూడా లాగారు. జీవితాన్ని ఎప్పుడూ ఒక కోణంలో నుంచే చూడకు .. రెండో కోణంలో నుంచి కూడా చూస్తేనే అసలు తత్వం అర్థమవుతుందనే కాన్సెప్టుతో నిర్మితమైన సినిమా ఇది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఉన్న కారణంగా, ఓటీటీ నుంచి ఈ సినిమాకి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.

Vishwak Sen
Mithila Palkar
Ori Devuda
  • Loading...

More Telugu News